ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం- కొట్టే వెంకటేశ్వర్లు

0
41

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా చిరంజీవి యువత పని చేస్తుందని చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని బాపూజీ కాలనీలో అమ్మ,నాన్నను కోల్పోయి నిరాశ్రయులైన నిరుపేద కుటుంబానికి చెందిన నీలాంబరికి చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఇల్లు కట్టించి గురువారం అందించడం జరిగింది. ముఖ్య అతిధులుగా విచ్చేసిన కొట్టే వెంకటేశ్వర్లు, శ్రీరామ్ ల చేతుల మీదుగా గృహ ప్రవేశం చేశారు. అనంతరం కొట్టే మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ అభిమానులు నేత్ర దానం రక్త దానం తో పాటు పలు సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారని తెలిపారు. చిరంజీవి సేవ సంఘం అధ్యక్షులు మాభాష మాట్లాడుతూ ఇల్లు కట్టించడానికి దాతలకు అయితే ఏమి చిరంజీవి సేవా సంఘం సభ్యులు అయితే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవా సంఘం సభ్యులు హరి,కోటి,ప్రభు, దాము,బాబు,రేవంత్శ,రవణ శివ, సర్దార్ సభ్యులు పాల్గొన్నారు.                                   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here