-గ్రామీణప్రాంతంలో రోలర్ స్కేటింగ్ శిక్షణా శిబిరం

0
180

ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలోని రైసుమిల్లు నందు జిల్లా క్రీడా పాధికార సంస్థ ఆదేశాలు మేరకు జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి ఉచిత రోలర్ స్కేటింగ్ శిక్షణా శిబిరం మే1 నుండి 31 వరకు నిర్వహించబడును అని తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి N V వెంకటేశ్వర్లు సందర్శించి స్కేటింగ్ క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత 20 సం. నుండి వేసవి ఉచిత రోలర్ స్కేటింగ్ శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నామని. ఈ సం. నెల్లూరు నగరంతో పాటు గ్రామీణప్రాంతమైన బ్రహ్మదేవి గ్రామంలోని రైసుమిల్లు నందు మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్నామని ఈ శిక్షణా శిబిరంలో 60 మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఈ శిక్షణా శిబిరాన్ని సీనియర్ స్కేటర్ అయిన D శరత్ పర్యవేక్షణలో జరుగుతున్నదని తెలిపారు. గ్రామీణప్రాంతంలో స్కేటింగ్ క్రీడపై మక్కువ చూపిస్తున్న క్రీడాకారులను మరియు వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యాక్రమంలో కోచ్ భరత్, తల్లిదండ్రులు, ఇతరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here