మానవాళి హితం ఆకాంక్షించేదే రంజాన్ పండుగ-నగర మేయర్ అబ్దుల్ అజీజ్

0
36

ఏ మతానికి చెందిన పండుగైనా దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుందని, మొత్తం మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమైన సందర్భమే రంజాన్ పండుగ మాసమని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. రంజాన్ మాసం మూడవరోజు ఉపవాసాలు పూర్తి చేసేందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నారాయణరెడ్డి పేటలోని పెద్ద మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో మేయర్ గురువారం సాయంత్రం పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్లామీయ కేలండర్లో 9వ మాసం ‘రంజాన్’ అని, ఈ నెలలోనే ‘దివ్య ఖురాన్’ అవిర్భవించిందని తెలిపారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసమని, ఈ పావన సమయంలో భక్తితో ఉపవాసం చేసిన వారి అన్ని తప్పులూ మన్నించబడతాయని మేయర్ పేర్కొన్నారు. అదేవిధంగా పేదవారు సైతం పండుగను సంతోషంగా జరుపుకోవడమే ‘జకాత్’ ప్రధాన ఉద్దేశ్యమని, తిండి బట్టకు నోచుకోని అభాగ్యులకు గోధుమలు, ఆహార ధాన్యాలు, ధనాన్ని అందజేయడం నిష్టతో కూడిన నియమం అని మేయర్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here