-మా భూములకు రక్షణ కల్పించండి – కలెక్టర్ కు వినతి

0
183

నెల్లూరు జిల్లా నారాయణపురం గ్రామంలో 1984 ల్యాండ్ సీలింగ్ కింద మాకు ప్రభుత్వం భూమి కేటాయించిందని గ్రామస్తులు తెలిపారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద వారు ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం అటవీశాఖాధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఈ విషయమై తమ సమస్యను జిల్లా కలెక్టర్ కు నివేదించడానికి వచ్చామని వారు తెలిపారు. 1984 లో తమకు కేటాయించిన భూమికి 1987 లో పట్టాలు మంజూరు చేసారని తెలిపారు. అప్పటినుండి మత్స్యకార రైతులమైన తాము ఆ పొలాలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అటవీ శాఖ అధికారులు సదరు పొలాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని , కలెక్టర్ గారు స్పందించి మా భూమిని కాపాడవసిందిగా కోరుతున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here