-అన్ని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : నగర మేయర్ అబ్దుల్ అజీజ్

0
57

రానున్న తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని టిడిపి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. నియోజకవర్గ గ్రామాలైన గొల్ల కందుకూరు, సజ్జాపురం, పాత వెల్లంటి, కొత్త వెల్లంటి, సౌత్ మోపూర్ ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించి స్థానికులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ పాలనలో గతంలో ఎన్నడూలేని విధంగా విలీన పంచాయితీలు, గ్రామాల అభివృద్ధి జరిగిందని, అన్ని ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు, వీధి దీపాల ఏర్పాటుతో పాటు నిరంతరం మంచినీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. అన్ని గ్రామాల్లో వ్యవసాయం, పశుపోషణలపై ఆధారపడి ఎక్కువ శాతం ప్రజలు జీవనం సాగిస్తున్నారని, నీటిపారుదల, పశుగ్రాసం కొరత వంటి ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరానికి కృషి చేస్తామని, అవసరమైన గ్రామాల్లో ఎత్తిపోతల పధకం ద్వారా పొలాలకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం, సామాజిక భవనాల ఏర్పాటు, పాఠశాలల్లో ఆధునిక వసతులు, పేదలకు శాశ్వత గృహాల నిర్మాణం, బలహీన వర్గాల ప్రజలకు ఇండ్ల స్థలాల మంజూరుకై ప్రణాళికలు సిద్ధం చేశామని మేయర్ స్పష్టం చేసారు. ఈ సమావేశాల్లో కార్పొరేటర్లు దొడ్డపనేని రాజానాయుడు, మన్నెం పెంచల నాయుడు, నాయకులు వేమిరెడ్డి అశోక్ రెడ్డి, అన్ని గ్రామాల టిడిపి కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here