-అంతర్జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారిణి ఎంపిక

0
409

జులై 4 నుండి 14వ తేదీ వరకు స్పెయిన్ రాజధాని బార్సిలోనా లో జరిగే అంతర్జాతీయ రోలర్ గేమ్స్ 2019 కు మొట్టమొదటిసారిగా జిల్లా క్రీడాకారిణి బి. పవిత్ర దుర్గ శ్రీ ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకు సంబంధించి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓవెల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న బి. పవిత్ర దుర్గ శ్రీ తన ఏడేళ్ల వయసు నుండి స్కేటింగ్ లో శిక్షణ పొందుతుందన్నారు. కోచ్ సిహెచ్. జితేంద్ర శిక్షణలో 2018 డిసెంబర్ మాసంలో విశాఖపట్టణం లో జరిగిన 56వ జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలలో రోలర్ డెర్ట్ ఈవెంట్ బాలికల విభాగంలో రజిత పతకం గెలుపొంది అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించిందన్నారు. అదేవిధంగా ఈ నెల 4, 5 వ తేదీలలో మహారాష్ట్ర నందుర్బార్ జిల్లాలో జరిగిన జాతీయ స్థాయి జట్టు ఎంపికల్లో ప్రత్యేక ప్రతిభ కనబరచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జాతీయ జట్టు శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుతుందన్నారు. మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ రోలర్ స్కేటింగ్ కు దేశం తరపున జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పవిత్ర దుర్గ శ్రీని అదేవిధంగా శిక్షకుడు జితేంద్ర ను జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శివ ప్రసాద్, ఈశ్వర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచి దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here