ZS NEWS / మహిళా సాధికారత జనసేనతోనే సాద్యం..

74

ZS NEWS  : మహిళా సాధికారత జనసేనతోనే సాద్యం…గర్భిణులకు సామూహిక సీమంతలు…మహిళా సాధికారత ఒక్క జనసేనతోనే సాధ్యమని జనసేన వీర మహిళ నాయకురాలు రాజేశ్వరి అన్నారు..సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకురు మండలం చాటగట్ల గ్రామంలో గురువారం జనసేన వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు కార్యక్రమం నిర్వహించి గర్భిణీలకు సారె అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారతతో పాటు చట్ట సభల్లో 33 శాతం రిజెర్వేషన్లు హామీల అమలు జనసేన పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నారు. అనంతరం వీర మహిళ నాయకురాళ్లు విజయలక్ష్మి, నాగరత్నం, రోజా రాణిలు మాట్లాడుతూ మహిళలంతా జనసేన పార్టీ కి ఓట్లు వేసేలా కుటుంబ సభ్యులని ఒప్పించి మహిళా సాధికారతకు సహకరించాలని కోరారు. అనంతరం జనసేన నాయకులు రాఘవయ్య, చంద్రమోహన్, మనుక్రాంత్ రెడ్డి లు మాట్లాడుతూ పేద మహిళలకు సామూహిక సీమంతాలునిర్వహించిన జనసేన మహిళ విభగం వారిని అభినందించారు. అనంతరం జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లాంటి సేవా భావం కలిగిన పిల్లలను కనడంతో పాటు వారిని ias, ips అధికారులుగా తీర్చిదిద్దాలన్నారు. పేద గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించి సారె లను అందచేయడం మంచి కార్యక్రమం అని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మురళి, సంజయ్, పృధ్వి, ప్రసాద్,చరణ్, జీవన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.