ZSNEWS / నెల్లూరు న‌గ‌రాన్ని సుద‌రంగా తీర్చిదిద్ద‌డ‌మే నాల‌క్ష్యం – మంత్రి నారాయ‌ణ‌

60

ZSNEWS – NELLORE / నెల్లూరు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మహ బూబ్ ఖాన్ పార్క్ న సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను మంత్రి నారాయణ ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న మాట్ల‌డుతూ న‌గ‌రంలో 71 పార్కులను ఆధునీకరించేందుకు పనులు జరుగుతున్నాయని,.అందులో ఇప్పటికే 50 పార్కులు ప్రారంభానికి దగ్గరలో ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ గృహ లబ్ధిదారులకు శుభవార్త లబ్ధిదారులు ఎవరు విద్యుత్ మీటర్ల కొరకు ఎలాంటి సొమ్ము చెల్లించనవసరం లేదని పేర్కొన్నారు. కేటాయించిన గృహాలు అన్నింటికీ ప్రభుత్వమే విద్యుత్ కనెక్షన్లు ఫ్యాన్లు ఎల్ఈడీ లైట్లు వంటి వాటిని సమకూర్చుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అన్ని వసతులతో గృహాలను లబ్ధిదారులకు అప్పగిస్తామ‌ని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో అధునాతన వసతులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. నగర ప్రజలు ఆహ్లాదంగా వారి ఖాళీ సమయాన్ని గడిపేందుకు ప్రతి పార్కులో వాకింగ్ ట్రాక్ జిమ్ పరికరాలను సమకూరుస్తున్నామ‌ని తెలిపారు. నెల్లూరు నెక్లెస్ రోడ్ అనే పేరుతో బారాషహీద్ దర్గా నుంచి ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వరకు రెండు కిలోమీటర్ల మేర ట్యాంక్ బండ్ నిర్మాణం వేగవంతంగా జరుగుతుందన్నారు. ఈ కార్య‌మంలో ఆయ‌న వెంట కార్పోరేట‌ర్ స‌త్య నాగేశ్వ‌ర‌రావు, టిడిపి న‌గ‌ర ఇంచార్జి ముంగ‌మూరు శ్రీధ‌ర్ క్రిష్ణారెడ్డి,కార్పోరేట‌ర్ దాస‌రి రాజేష్‌,మున్సిప‌ల్ సిబ్బింది త‌దిత‌రులు పాల్గొన్నారు.