ZSNEWS/ జనసేనతోనే మహిళా సాధికారత-కొట్టే వెంకటేశ్వర్లు

15

ZSNEWS/(NELLORE)-జనసేనతోనే మహిళా సాధికారత…జనసేన పార్టీతోనే మహిళలకు సాధికారత సాధ్యమవుతుందని ఆ పార్టీ నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. నెల్లూరు నగరం 1వ డివిజన్ జనసేన కార్యకర్తల ఆహ్వానం మేరకు
జనంలోకి జనసేన తరంగం కార్యక్రమంలో పాల్గొని జనసేన మేనిఫెస్టో కరపత్రాలను ఇచ్చి దానిలో ఉన్న అంశాలను మహిళలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యతరగతి మహిళలను దృష్టిలో ఉంచుకొని అమలు చేయగల పథకాలను మేనిఫెస్టోలో పెట్టారన్నారు. మహిళలు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే సుభిక్ష ఆంధ్ర ప్రదేశ్ సాధ్యమవుతుందని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేస్తారన్నారు. దానితోపాటు రేషన్ బియ్యం బదులు వారి ఖాతాలకు 2500 నుంచి 3500 నగదు మరియు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలు అందజేస్తారని హామీలు ఇచ్చారని తెలిపారు. మహిళా తల్లులు కూడా ఈసారి కచ్చితంగా జనసేన పార్టీ అధికారం రావాలని పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మునీర్, సుమంత్, ఉదయ్, కిరీటి, శరత్, సురేష్, లోకేద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.