ZSNEWS / ఎంజిబి ఫెలిసిటీ మాల్‌లో నూత‌న గేమ్స్ ను ప్రారంభించిన ఈఎస్ గేమ్స్ సంస్థ‌

57

 

 

ZSNEWS-NELLORE / ఎంజిబి ఫెలిసిటి మాల్ యాజ‌మాన్యం మ‌రింతగా ప్ర‌జ‌ల‌కు ఆహ్లాద‌క‌ర‌మైన గేమ్స్‌ను అందించేందుకు ఈఎస్ గేమ్స్ వారి నుంచి నూతనంగా వాట‌ర్ జార్బో పూల్‌,థామ‌స్ ట్రాక్‌లెస్ ట్రైన్‌, బౌన్సీ హౌస్‌ను నెల్లూరులో గురువారం మాల్ ఆవ‌ర‌ణ‌లో మాల్ జ‌న‌ర‌ల్ మెనేజ‌ర్‌ రవికిరణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాల్ మేనేజ‌ర్ మాట్లాడుతూ అమ్యూస్‌మెంట్‌లో ఇది ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుందని ఇటువంటి గేమ్స్ వల్ల పిల్లలు ఆహ్లాదకరంగా , వినోదంగా వ్యవహరించగలరని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మాల్ లోగ‌ల‌ కార్ రైడ్స్, ఇతర గేమ్స్ ను ఆదరించినందుకు కస్టమర్ లకు ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈఎస్ గేమ్స్ సంస్థ అధినేత మ‌ణికుమార్, ప‌వ‌న్‌కుమార్‌, ఎంజిబి ఫెలిసిటీ మాల్ స్టాఫ్ , త‌దిత‌రులు పాల్గొన్నారు.