ZSNEWS / బీసీలను ఆదరించడమే టీడీపీ ప్రభుత్వ ల‌క్ష్యం – సోమిరెడ్డి

67

ZSNEWS / బీసీలను ఆదరించడమే లక్ష్యంగా ఆదరణ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముత్తుకూరులో ఆదరణ-2 పథకం లబ్ధిదారులకు ఆధునిక వృత్తి పరికరాలు పంపిణీ చేసిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ,90 శాతం సబ్సిడీపై రూ.750 కోట్లతో రాష్ట్రంలో 4 లక్షల మందికి ఆధునిక పరికరాలు పంపిణీ చేస్తున్నామ‌ని, జిల్లాలో రూ.31 కోట్లతో విడతల వారీగా 18,075 మందికి పరికరాలు అందిస్తామ‌న్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో 1,537 మంది దరఖాస్తు చేసుకున్నారని, .అందరికీ కోరుకున్న పరికరాలు అందజేస్తామ‌న్నారు. ఆదరణ పథకంలో పరికరాలు పొందిన వారు సబ్సిడీ రుణాలు పొందేందుకూ అర్హత కల్పించామ‌ని, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా ఆన్ లైన్ ద్వారా పారదర్శకంగా అమలు చేస్తున్నాని తెలిపారు. ప్రతి ఒక్కరూ పేదరికంపై గెలవడమే సీఎం చంద్రబాబు లక్ష్యమ‌న్నారు. నీటి యాజమాన్యం, అభివృద్ధి పనుల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలును ఓ బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామ‌ని, ఎస్సీ సబ్ ప్లాన్ కింద వివిధ పనులు చేపట్టేందుకు సర్వేపల్లి నియోజకవర్గానికి మంత్రి నక్కా ఆనందబాబు రూ.15 కోట్లు మంజూరు చేశామ‌ని తెలియ‌జేశారు. ప్రతి శాఖ పరిధిలో నిత్యం పర్యవేక్షిస్తూ వందలకోట్లు తెచ్చి సర్వేపల్లి నియోజకవర్గాన్ని కనివీని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. కళ్లు తెరిచి చూస్తే మేం చేసిన అభివృద్ధి కనిపిస్తుంది..కళ్లు మూసుకుని మమ్మల్ని తిడతాకూర్చుంటే ప్రయోజనం లేదని . శాసనసభ ఎగ్గొట్టి రోడ్లపై తిరుగుతూ నోటికొచ్చినట్టు మాట్లాడటం దురదృష్టకరమ‌ని ఎన్నికల్లో గెలిచి చట్టసభలకు వెళ్లని వారికి ప్రజలు మళ్లీ ఎందుకు ఓటు వేయాలని, గెలిచిన వారు శాసనసభలో ఉండాలి..ఓడినవారు రోడ్లపై తిరగాలని మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండని మండిప‌డ్డారు. ఇరిగేషన్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామ‌ని, పెన్నాపరివాహక ప్రాంతంలో చుక్క వర్షం కురవకపోయినా ఈ ఏడాది శ్రీశైలం నుంచి 48 టీఎంసీల క్రిష్ణా జలాలను జిల్లాకు తీసుకొచ్చామ‌ని అన్నారు. సోమశిల చరిత్రలో 48 టీఎంసీల నీళ్లు తెచ్చుకోవడం ఇదే తొలిసారి అని, నెల్లూరుకు నీటి తరలింపుని నిరసిస్తూ కడప, కర్నూలులో రైతులు, ప్రజాప్రతినిధులు రోడ్డెక్కిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయ‌న్నారు. ఎవరైనా సమాచార హక్కు చట్టం కింద క్రిష్ణా జలాల సమాచారం కోరి తెలుసుకోవచ్చున్నారు.
టీఎంసీ అంటే తెలియని వారు శ్రీశైలం నుంచి నీళ్లు తేలేదని మాట్లాడుతున్నారని, పచ్చి అబద్ధాలను జనం నమ్మరనే విషయం గుర్తుంచుకుని మాట్లాడాల‌ని సూచించారు. పెన్నా-గోదావరి అనుసంధానం మొదటి దశకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు..ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని కొనియాడారు. ఏటా గోదావరి జలాలు 2500 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయని, గోదావరితో పెన్నానదిని అనుసంధానం చేసే ప్రయత్నం నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమ జిల్లాలకు అద్భుతమైన వరమ‌న్నారు.