ZS News / ముత్తుకూరులో పార్కు అభివృద్ధి చేసేందుకు స్థల పరిశీలన చేసిన నుడా చైర్మన్,సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి

97

ZS News (Nellore) : నుడా ఆధ్వర్యంలో ముత్తుకూరులో పార్కు అభివృద్ధి చేసేందుకు స్థల పరిశీలన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసారు. రూ.50 లక్షలతో పార్కును అభివృద్ధి చేసేందుకు టెండర్ ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు. మంత్రి సోమిరెడ్డి సహకారంతో సర్వేపల్లి నియోజకవర్గంలోని నుడా పరిధి గ్రామాల్లో పార్కులను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సానుభూతి కోసమే జగన్ కోడికత్తి డ్రామా ఆడారని పేర్కొన్నారు. రాజకీయాల్లో భాష బాగుండాలి కానీ సర్వేపల్లి ఎమ్మెల్యే మితిమీరి అసభ్యపదజాలంతో మాట్లాడుతున్నారు అన్నారు. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి నాయకులను చూడలేదన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పార్కులను సుందరంగా తీర్చిదిద్దేందుకు పూర్తి సహకారం అందిస్తున్న నుడా చైర్మన్ కోటంరెడ్డికి ధన్యవాదములు రాజగోపాల్ రెడ్డి తెలియజేసారు. పట్టణాలకు దీటుగా పోర్టు సిటీగా అభివృద్ధి చెందుతున్న ముత్తుకూరులో అందమైన పార్కు అందుబాటులోకి రానుండటం ఆనందంగా ఉందన్నారు.