ZSNEWS/పీపుల్స్ పార్కు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన-మేయరు

43

ZSNEWS/(NELLORE)-దేశంలోని మెట్రో నగరాల పార్కులకు దీటుగా అత్యంత సుందరంగా నగరంలోని అన్ని పార్కులను తీర్చిదిద్దుతున్నామనీ, స్థానిక ప్రజల పర్యవేక్షణతోనే పార్కుల నిర్వహణ సాధ్యమని మేయరు అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. స్థానిక 18వ డివిజను హరనాధపురంలోని పీపుల్స్ పార్కు ఆధునీకరణ పనులకు మేయరు ఆదివారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కులో పచ్చదనం, మొక్కల పెంపకం, పాదచారుల మార్గం, మంచినీటి వసతి, బిందు సేద్యం పధ్ధతి ద్వారా మొక్కలకు నీరు, విద్యుత్ దీపాలు, బల్లలూ, చిన్నపిల్లల ఆటవిడుపు పరికరాలు, జిమ్ సౌకర్యం వంటి వసతులను అధునాతన స్థాయిలో కల్పించనున్నామని తెలిపారు. ఇదేవిధంగా నగరంలోని 25 ప్రధాన పార్కులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, విచ్చేసే సందర్శకులకు యోగా, వ్యాయామం, ఆట పరికరాలు వంటి మౌళిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ప్రజలంతా అసోసియేషనులుగా ఏర్పడి తమ స్థానిక పార్కులను సంరక్షించుకుంటూ, పార్కుల నిర్వహణా బాధ్యతలను పర్యవేక్షించాలని మేయరు కోరారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే వినూత్న కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నామనీ, అందులో భాగంగా కార్పోరేషను పరిధిలోని జనావాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల వివరాలను సేకరించి మరో వంద పార్కుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి నన్నేసాహేబ్, కార్పొరేటరు దారా సరోజనమ్మ, నాయకులు షంషుద్దీన్, దారా వంశీ కృష్ణ, చినిగ శ్రీనివాసులు రెడ్డి, రవీంద్రా రెడ్డి, అనిల్ కుమార్, కార్పోరేషను అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.