ZSNEWS/ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

84

ZSNEWS/(NELLORE)-జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఉత్తర్వుల మేరకు డీఎస్పీలు మురళి కృష్ణ ,బాల సుందరం ఆధ్వర్యంలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 11 మంది ఎస్సైలు 135 మంది పోలీస్ సిబ్బందితో పట్టణంలోని నవాబ్ పేట పరిధిలోని బోడిగాడి తోటలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. అనుమానంగా ఉన్న వ్యక్తులను వాహనాలను తనిఖీ చేశారు. ఈ సెర్చ్ లో 30 మంది అనుమానితులను 25 వాహనాలను స్వాధీనపరచుకొని విచారిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానితుల సమాచారం పోలీసు అధికారులకు తెలియజేసి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో సి సి ఎస్ సీఐ ఎస్ కే బాజీ జాన్ సైదా, చిన్న బజార్ సి ఐ సుభాన్ ,బాలాజీ నగర్ సీ ఐ గోపాల్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.