ZS News / బుడ్డోడికి లిప్ లాక్ లతో మతి పొగుడుతున్న కత్రినా… !

97

ZS News (Cinema) : షారుఖ్ ఖాన్ నటించిన జీరో సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆ సినిమా లో షారుఖ్ ఖాన్ మర గుజ్జు పాత్రలో నటించాడు. అయితే ఆ సినిమాలో కత్రినా లిప్ లాక్ కిస్సెస్ అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి. అప్పుడెప్పుడో కమల్‌హాసన్‌ హీరోగా ‘విచిత్ర సోదరులు’ సినిమా వచ్చింది. అందులో కమల్‌హాసన్‌ మరుగుజ్జు పాత్రలో కన్పించిన సంగతి తెల్సిందే. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆ సినిమా ఓ అద్భుతం. ఆ మరుగుజ్జు పాత్రను అలా ఎలా చూపించారబ్బా.? అంటూ ఇప్పటికీ చాలామంది జుట్టు పీక్కోవాల్సిందే. ఇప్పట్లోలా అప్పట్లో గ్రాఫిక్స్‌ వినియోగం లేదు. అయినా, ఆ సినిమాలో ఆ మరుగుజ్జు పాత్రని అంత అద్భుతంగా తీర్చిదిద్దారు.

ఇక, ‘జీరో’ విషయానికొస్తే.. బాలీవుడ్‌ ‘కింగ్‌ ఖాన్‌’ షారుక్‌ఖాన్‌ మరుగుజ్జు పాత్రలో కన్పించాడు. అతనికి జోడీగా అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. మరుగుజ్జు అయినా, మనోడి ‘ఆటిట్యూడ్‌’ అలా ఇలా లేదు.. ఓ రేంజ్‌లో కన్పించింది. హీరోయిన్‌ కత్రినాకైఫ్‌ బుడ్డోడికి (మరుగుజ్జు షారుక్‌ఖాన్‌కి) లిప్‌ టు లిప్‌ కిస్‌ కూడా ఇచ్చేసిందండోయ్‌. సినిమా బాగా రిచ్‌గా తెరకెక్కింది. విదేశాల్లోనూ సినిమా చిత్రీకరణ జరిగింది. విజువల్స్‌ చాలా చాలా బాగున్నాయి.

అనుష్క శర్మ ఈ సినిమాలో మరో విలక్షణమైన పాత్రలో కన్పించబోతోంది. వీల్‌ ఛెయిర్‌కే పరిమితయ్యే యువతిగా నటిస్తోంది అనుష్క శర్మ. తన మరుగుజ్జు కారణంగా తనను ఎవరూ పెళ్ళి చేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో షారుక్‌, ఏకంగా అనుష్కని ఎంచేసుకుంటాడు. కానీ, ఆమె వీల్‌ ఛెయిర్‌కే పరిమితమవుతుందని తెలిసి.. షాకవుతాడు. ఆ తర్వాత అనుష్కకి క్లోజ్‌ అయ్యే సీన్స్‌, ఇంకోపక్క కత్రినకి దగ్గరయ్యే సీన్స్‌.. వెరసి.. ‘ట్రైలర్‌’ని ఫుల్‌ లెంగ్త్‌ సినిమా.. అన్నట్లుగానే వదిలేశారు. షారుక్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తోంది.