ZSNEWS / ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం…

36

ZS NEWS /(NELLORE) : -ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు సైకియాట్రిస్టులు మరియు నర్సింగ్ స్టూడెంట్స్ కలిసి విఆర్సి గ్రౌండ్నుండి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని లోక్ అదాలత్ సీనియర్ సివిల్ జడ్జి పిజె .సుధ ప్రారంభించారు.మానసిక వ్యాధుల వలన ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని వీటిని తొలగించడానికి న్యాయ ,పోలీసు మరియు మానసిక వైద్యనిపుణులు కలిసికట్టుగా పని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సివిల్ జడ్జి శ్రీమతి పి జె సుధా తెలిపారు. మానసిక వ్యాధి నిపుణులు ఎక్కువమంది అవసరం ఉందని డాక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. మానసిక వ్యాధులు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని డాక్టర్ శ్రీనివాసతేజ చెప్పారు. మారుతున్న సమాజంలో టెక్నోలజీ ప్రభావిత మానసిక సమస్యలు ఎక్కువయ్యాయని డాక్టర్ లక్ష్మీప్రసన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి మురళీధర్, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ రమేష్ బాలాజీ ,డాక్టర్ గంగాధర్,  డాక్టర్ పద్మావతి ,డాక్టర్ హర్ష, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ రాజు, డాక్టర్ టాగూర్ మరియు విద్యార్థులు నర్సింగ్ స్టూడెంట్ లు పాల్గొన్నారు.