ZS News / నగరంలో డాలర్ల పేరుతో చీటింగ్ వ్యక్తి అరెస్ట్….

42

ZS News (Nellore) : నెల్లూరు నగరంలోని మన్సూర్ నగరంలో అద్దె ఇంట్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నారు.
నెల్లూరు జిల్లాలో మాటు వేసిన ఢిల్లీ ఓల్డ్ సిటీ కి చెందిన సిరాజ్, జబ్బార్, రిదొమ్ ఖాన్ అనువారు నెల్లూరు నందు, చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ, వారి వద్ద ఉన్న “అమెరికన్ డాలర్” నోట్లును అమాయకులు ఐన, హిందీ తెలిసిన వారికి చూపిస్తూ ఇండియా డబ్బులు ఇచ్చిన ఎడల వాటికి రెండింతలు గా అమెరికన్ డాలర్లు ఇస్తామని ఆశ చూపిస్తూ చివరికి బాధితులు వద్ద ఇండియన్ కరెన్సీ తీసుకోని, వారికి సబ్బుకు చుట్టిన న్యూస్ పేపర్ ని గుడ్డలో మూట కట్టి ఇచ్చి పోలీసులు వస్తున్నారని తొందర పెట్టి ఇంటికి వెళ్లి చూసుకోమని పంపి వేస్తారు అని ఆయన తెలిపారు.