ZSNEWS / కవాతులో నెల్లూరు జన సైనికులు….

57

ZSNEWS/ రాజకీయాల్లో జవాబుదారితనం కోరుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్రిడ్జి పై సోమవారం చేపట్టిన కవాతు కార్యక్రమానికి నెల్లూరు జిల్లా చిరంజీవి యువత,జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కవాతుకు స్వచ్చందంగా తరలివచ్చిన జనసందోహన్ని చూస్తుంటే 2019లో పవన్ కళ్యాణ్ సీఎం కావడం తధ్యమన్నారు…నెల్లూరు జిల్లానుంచి వచ్చిన కార్యకర్తలు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఆనంతరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు కె కృష్ణారెడ్డి మాట్లాడుతూ కవాతుకు వచ్చిన ప్రజలకు భోజన సదుపాయాలు కల్పించిన స్థానిక నాయకులకు, అఖిల భారత చిరంజీవి యువత నాయకులు స్వామినైడుకి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో వై రవికుమార్, కోవూరు హరి, చంద్రశేఖర్, రాజా, సందీప్, కిషోర్, ఉదయ్, రమేష్ జీవన్, మధు, హర్షలు పాల్గొన్నారు.