ZSNEWS/నుదుట తిలకం, చేతిలో లడ్డు, దర్శకుడు వర్మ కొత్త అవతారం…

82

ZSNEWS/ కాణిపాకం వినాయకుడు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.నాస్తికుడు అని చెప్పుకునే రాంగోపాల్ వర్మ ఒకే రోజు రెండు దేవాలయాలను సందర్శించారు. మొదట కాణిపాకం శ్రీ వినాయక స్వామి వారిని దర్శనం చేసుకొని తరువాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.నుదుట సింధూరం చేతిలో స్వామి వారి లడ్డు సంప్రదాయ వస్త్రధారణతో దిగిన ఫోటోలు పోస్ట్ చేసి తనదైన శైలిని చాటుకున్నారు.లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం దివంగత శ్రీ నందమూరి తారక రామారావు గారే తనని ఇలా మార్చారని క్యాప్షన్ దిగువపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని శిల్పారామంలో ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్  సినిమా కి సంబంధించిన విశేషాలను తెలియజేస్తానని తెలిపారు.