ZS News / యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘ఎవనుం బద్దనిల్లై’

63

ZS News కోడంబాక్కం, న్యూస్‌టుడే : ‘వి’ సినిమా గ్లోబల్‌ నెట్వర్క్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఎవనుం బుద్దనిల్లై’. నబినంది, శరత్‌లు హీరోలుగా పరిచయమవుతున్నారు. శ్వాసిక కథానాయిక. పూనంకౌర్‌ అతిథిపాత్ర పోషించారు. ప్రముఖ పాటల రచయిత స్నేహన్‌ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. మరియా మనోహర్‌ సంగీతం సమకూర్చారు. ఎస్‌.విజయశేఖరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ‘ఇదో జనరంజకమైన చిత్రం. ముఖ్యమైన సందేశాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేశాం. అన్నా చెల్లెళ్ల అనుబంధం కూడా ఇందులో ఉంటుంది. యాక్షన్‌, థ్రిల్లర్‌ అంశాలు నిండుగా ఉంటాయి. యువతకు చాలా ముఖ్యమైన చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. ఇటీవలే సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం.

చిత్రీకరణ పూర్తయింది. నవంబరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని’ పేర్కొన్నారు. ఆర్ట్‌ పళనిస్వామి, స్టంట్‌ అన్బు అరివు, మిరాకిల్‌ మైఖెల్‌, పాటలు స్నేహన్‌లు అందించారు.