ZSNEWS / వివాహేతర సంబంధం…. కన్‌ఫ్యూజన్లో శ్రీరెడ్డి, దీన్ని మంచి అనాలా? చెడు అనాలా?

93

ZSNEWS / CINEMA – వివాహేతర సంబంధం నేరం కాదు అంటూ…. సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై నటి శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు ఒక పత్రికలో వచ్చిన ఈ వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్ పోస్టు చేసిన శ్రీరెడ్డి…. ఈ తీర్పు వల్ల పెళ్లైన ఆడవారిలో అభద్రతా భావం, టెన్షన్ పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ తీర్పు వల్ల మగాళ్లు పండగ చేసుకుంటున్నారు అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా మగాళ్లకే ఎక్కువ వివాహేతర సంబంధాలు ఉంటాయని ఆమె చెప్పకనే చెప్పారు.
దీన్ని మంచి అనాలా? చెడు అనాలా? వివాహేతర సంబంధం నేరం కాదు… అంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంటుపై తనకు ఎలా స్పందించాలో అర్థం కావడం లేదని, ఈ తీర్పు తర్వాత తాను అయోమయంలో పడిపోయానని శ్రీరెడ్డి వెల్లడించారు. ఈ తీర్పును మంచి తీర్పు అనాలా? లేక చెడ్డ తీర్పు అనాలా? అర్థం కావడం లేదని శ్రీరెడ్డి అన్నారు.

వివాహేతర సంబంధం, సెక్షన్ ఐపిసి సెక్షన్ 497 గురించి ఈ సెక్షన్‌ను సుప్రీమ్ కోర్టు కొట్టివేసినప్పటినుంచి చాలా హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఇకనుంచి పెళ్లి అన్నదానికి పవిత్రతే ఉండదని, అందరూ బరితెగించి బజారున పడతారని, కొంచెం అభ్యుదయవాదులు అనుకున్న వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయి ఏవేవో పోస్టులు పెడుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ సెక్షన్ గురించి చెబుతున్నాను అంటూ సి స్మైలీ వనజ అనే ఉమెన్ యాక్టివిస్ట్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా… శ్రీరెడ్డి అభిమానులతో పంచుకున్నారు.
ఆ చట్టంలో ఏముందంటే…? ఐపి‌సి సెక్షన్ 497 ఏం చెప్తుందంటే భార్య “తన భర్త అనుమతి” లేకుండా ఇతర పురుషునితో వివాహేతర సంబంధం కలిగి ఉంటే, ఆ భర్త అలాంటి సంబంధం కలిగి ఉన్న పురుషుడి పైన నేరం నమోదు చేసి ఒకటి నుంచి ఏడేళ్ళ వరకు శిక్ష వేయించవచ్చు. కానీ ఆ సంబంధానికి భర్త అనుమతి ఉంటే అది నేరం కాదు. మరి అలా సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఒకవేళ పెళ్ళయి ఉంటే అతని భార్య సంగతేమిటి? ఆమె కూడా అతని మీద కేస్ పెట్టొచ్చా? ఈ సెక్షన్ ప్రకారం అలా కేస్ పెట్టటానికి ఆమెకి హక్కు లేదు. కేవలం పురుషుడు తనకు హక్కుగా ఉన్న స్త్రీ తన అనుమతి లేకుండా ఇతర పురుషుడితో ఇష్టంగా గానీ అవతలి పురుషుడి బలవంతం వల్ల గాని శారీరకంగా కలిసినప్పుడు మాత్రమే నేరం అవుతుంది. ఇది ఒక స్త్రీ శరీరం మీద ఇద్దరు పురుషుల హక్కుకు సంబంధించిన చట్టం మాత్రమే. అందుకే సుప్రీం కోర్టు ఈ సెక్షన్ ను కొట్టివేస్తూ ఒక మాట అన్నది. “హస్బండ్ ఈజ్ నాట్ ది మాస్టర్ ఆఫ్ హిస్ వైఫ్” భార్యకు భర్త యజమాని కాడు. నిజానికి ఇది ఎప్పుడో తుప్పు పట్టిపోయిన చట్టం. ఎప్పుడో ఏదైనా కక్ష సాధించటం కోసం కానీ కుట్ర పూరితంగా గానీ దశాబ్దానికి ఒకటి కూడా ఈ సెక్షన్ కింద కేసులు నమోదు కావటం లేదు. సెక్షన్ 377 లాగా బ్రిటిష్ వాళ్ళు తమ చట్టాల నుంచి యథాతథంగా మన నెత్తిమీద పెట్టిన చట్టాల్లో ఇది ఒకటి…. స్మైలీ వనజ అనే ఉమెన్ యాక్టివిస్ట్ చెప్పిన విషయాన్ని శ్రీరెడ్డి ఉఠంకించారు.
పచ్చ జెండా ఉపినట్లు కాదు అయితే దీనితో వివాహేతర సంబంధాలకు సుప్రీం కోర్ట్ పచ్చ జెండా ఊపిందా అంటే లేదు. ఇది కేవలం నేరశిక్షాస్మృతి కింద నేరం కాదు కానీ ఒక గ్రౌండ్ ఫర్ డైవర్స్‌గా కొనసాగుతుంది. అంటే ఈ వివాహేతరబంధాల కారణంగా విడాకులు అడిగే హక్కు కొనసాగుతుంది. కుటుంబ చట్టాల్లో దీనికి జెండర్ వివక్ష లేదు. స్త్రీ పురుషులిద్దరూ ఆ కారణంగా విడాకులు అడిగే అవకాశం ఉంటుంది. వివాహబంధంలో ఒక క్షోభ కారకంగా కుటుంబ చట్టాల్లో ముఖ్యంగా గృహ హింస నిరోధక చట్టంలో కూడా ఇది కొనసాగుతుంది…. అని శ్రీరెడ్డి తన పోస్టులో వనజ చెప్పిన విషయాలను వెల్లడించారు.