ZS NEWS / హఠాత్తుగా బిగ్‌ బాస్‌ నుంచి దీప్తి ఎలిమినేట్‌‌?

76

ZS NEWS : దాదాపు మూడున్నర నెలల నుంచి బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 తుది అంకానికి వచ్చింది. ఈ వారంతో బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సమయంలో బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఏదైనా జరగవచ్చని తెలుస్తోంది. ఇప్పటి వరకు 14 ఎలిమినేషన్స్‌ జరిగి, టాప్‌ 5 కంటెస్టెంట్లు గ్రాండ్‌ ఫినాలేకు చేరుకున్నట్టు తెలిసిందే. అయితే వారిలో ఒకరు  నేడు హఠాత్తుగా ఎలిమినేట్‌ అవుతున్నట్టు బిగ్‌ బాస్‌ నుంచి సమాచారం అందుతోంది. అదేంటి? శని లేదా ఆదివారాల్లో కదా బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టేది. ఇప్పుడు ప్రత్యేకంగా ఎలిమినేట్‌ చేపట్టడం ఏమిటా అనుకుంటున్నారా?

అంటే నేడు బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌(వారం మధ్యలో ఎలిమినేషన్‌) ప్రక్రియ చేపట్టాలని బిగ్‌ బాస్‌ భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ ఎలిమినేషన్‌లో టీవీ 9 యాంకర్‌గా పేరొందిన, దీప్తి నల్లమోతు హౌజ్‌ నుంచి బయటికి పంపించేయాలని ప్లాన్‌ చేశారట. ఆ విధంగా గ్రాండ్‌ ఫినాలేలో నలుగురు మాత్రమే పోటీ పడేటా బిగ్‌ బాస్‌ నిర్ణయించారని టాక్‌. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం దీప్తిని ఓటింగ్‌ ఆధారంగా బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి బయటికి పంపించేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాక ఆమెపై ఇటీవల ఫేక్‌ ఓటింగ్‌ చేపడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో దీప్తి ఈ మిడ్‌ వీక్‌లో ఎలిమినేట్‌ అయిపోతే, బిగ్‌ బాస్‌ హౌజ్‌లో గీతా మాధురి, సామ్రాట్‌, కౌశల్‌, తనీష్‌ మాత్రమే మిగలనున్నారు. వారిలో ఇద్దరు గ్రాండ్‌ ఫినాలేలో ఎలిమినేట్‌ అయి, మరో ఇద్దరు ఫైనల్‌కు చేరుకుంటారు. వారిలో ఒకరు విజేతగా బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేతగా నిలుస్తారు.  మరి మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌పై బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 హోస్ట్‌ నాని ఏం ప్రకటన చేస్తారో నేడు చూడాల్సి ఉంది.