ZS News / మరుగుదొడ్డి స్థలాన్ని టీడీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారన్నా..

58

ZS News తూర్పుగోదావరి :  కత్తిపూడిలో ఊరమెట్ట వద్ద ఉన్న మరుగుదొడ్డి స్థలాన్ని టీడీపీ నేతలు అన్యాయంగా స్వాధీనం చేసుకున్నారన్నా అంటూ గ్రామానికి చెందిన బొండాడ సత్యవతి జగన్‌కు తెలిపింది. పాదయాత్రలో జగన్‌ను కలుసుకుని సమస్య వివరించింది. సుమారు నాలుగు సెంట్ల స్థలంలో గతంలో మరుగుదొడ్లు ఉండేవని, వీటిని పడగొట్టి తిరిగి మరుగుదొడ్లు కడతామని చెప్పి స్థానిక టీడీపీ నేతలు ఆడవారితో సంతకం చేయించుకున్నారు. వారు తమను మోసగించి తాము పెట్టిన సంతకాలతో ఆ స్థలాన్ని పసుపు, కుంకుం మాన్యం కింద రాయించుకున్నారని వాపోయింది. ఆ స్థలంలో షాపులు నిర్మించుకునేందుకు చూస్తున్నారని తమకు తెలిసిందని దీనిపై తమకు న్యాయం చేయాలని జగన్‌ను కోరినట్టు తెలిపింది.