పిఠాపురం బహిరంగ సభపైనే అందరి దృష్టి!

52

ZS News/ ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 225వ రోజుకు చేరింది. మంగళవారం ఉదయం ఆయన పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి విరావాడ, ఎఫ్‌కే పాలెం కుమారపురం మీదుగా పిఠాపురం వరకు జగన్ ఇవాళ పాదయాత్ర కొనసాగించనున్నారు. పిఠాపురంలో సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్న జగన్.. ప్రజల సమస్యలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.ఒక పక్క కాపు రిజర్వేషన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి దింతో ఈరోజు జరిగే బహిరంగ సభకు కొంత ప్రాధాన్యత ఏర్పడింది.ఈ సభలో కాపు రిజర్వేషన్ పై జగన్ మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది అని సమాచారం.