ZS NEWS/ గోంగూర మటన్

66
ZS NEWS/ కావలసిన పదార్థాలు: మటన్‌- అర కిలో, గోంగూర- 3 కట్టలు, తరిగిన పచ్చిమిర్చి- 6, పసుపు- ఒక టీ స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టేబుల్‌ స్పూను, గరం మసాలా- ఒక టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, నూనె- ఒక టేబుల్‌ స్పూను, కారం- 2 టీ స్పూన్లు, ధనియాల పొడి- ఒక టీ స్పూను, జీలకర్ర పొడి- అర టీ స్పూను, ఉప్పు- తగినంత.
తయారీ విధానం: కుక్కర్‌లో మటన్‌, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించాలి. తర్వాత బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయలు, గరం మసాలా వేసి ఒక నిమిషం సేపు వేగించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, పచ్చిమిర్చి, గోంగూర వేసి బాగా కలిపి చిన్న మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత ఉడికిన మటన్‌, తగినంత ఉప్పు వేసి కలిపి పది నిమిషాలు ఉడికించి దించేయాలి.