ZS News / ఎకానమీ క్లాస్ లోనే జర్నీ

123

ZS News (Movies) బ్యూటీ రాధికా ఆప్టే అంటేనే ఓ సెన్సేషన్. క్యారెక్టర్ కోసం ఎంతకైనా తెగించేసేందుకు సిద్ధం అనే ప్రతిభ గల అందాల భామలు చాలా అరుదుగా ఉంటారు. సన్నివేశం డిమాండ్ చేస్తే ఏ తరహాగా అయినా నటించేందుకు రెడీ అనేసే రాధికా ఆప్టే.. పొదుపు కూడా పాటించేస్తోందిట. ఆ విషయం కూడా తనే చెప్పేస్తోంది.

ఈవిడ భర్త పేరు బెనెడిక్ట్ టేలర్.. యూకేలో ఓ మ్యుజీషియన్. తనేమో అక్కడే ఉంటాడు.. ప్రొఫెషనల్ గా బిజీ. ఈమె గారు ఇండియాలో ఇంకా ఎక్కువ బిజీ. నెలకో రెండు మార్లు లండన్ పోయి తన భర్తతో గడిపివస్తూ ఉంటుంది. ఎంత సంపాదించేసినా.. నెలకు రెండుసార్లు లండన్ కి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ జర్నీ అంటే బిల్లు తడిసి మోపెడవుతుంది కదా.. అందుకే ఎకానమీ క్లాస్ లోనే జర్నీ చేస్తూ ఉంటుందిట. అయినా సరే.. తన భర్తని కలిసేందుకు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని.. అందుకే వీలైనంత పొదుపుగా వెచ్చిస్తానని అంటోంది రాధిక.