ZS News / అంత‌రాష్ట్ర ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్లు అరెస్ట్‌

77

ZS News (Nellore) : 9మంది అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు గూడూరు డిఎస్ పి రాంబాబు వెల్లడించారు. వెంకటాచం, చిల్లకూరు, నాయుడుపేట ప్రాంతాలలో ఏక కాలంలో దాడులు నిర్వహించి 40 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు, 11 సెల్ ఫోన్లు, 5250 రూపాయలు నగదు వీరి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నెల్లూరు జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు జిల్లా క్రైమ్ ఓ ఎస్ డి విఠలేశ్వర రావు ఆధ్వర్యంలో టార్స్ పోర్స్ సిబ్బంది, వెంకటాచలం సత్రం, చిల్లకూరు, నాయుడుపేట ఎస్ ఐ లు నాగరాజు శ్రీనివాస్ రావు, రవి నాయక్ వారి సిబ్బంది కలసి సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు తెలిపారు. స్మగ్ల ర్లు పోలీసుల మీదకి దాడి చేయడానికి ప్రయత్నించారు. వీరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.