Zs News /కేంద్ర‌బ‌డ్జెట్ ఏపికి తీర‌ని అన్యాయం – సోమిరెడ్డి

129

జిల్లాస‌మాచారం (నెల్లూరు) కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా వెంకటాచలంలో సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో టీడీపీ ఎంపీల నిరసనకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏకపక్షంగా అన్యాయంగా విభజించిందన్నారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాజధాని కూడా లేకుండా విభజనకు గురైయ్యామన్నారు. బీజేపీ మిత్రధర్మం పాటించడంతో పాటు విభజన హామీలు అమలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా వీలు కాదని, దానికి సమానంగా ప్యాకేజీ ఇస్తామన్నారు….కానీ బడ్జెట్ లో కేటాయింపులు లేవన్నారు. కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. కేంద్రం పెద్దలు వెంటనే స్పందించి బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్నిసవరించాలన్నారు. హామీలను ఆపి నిధులివ్వాలన్నారు. బడ్జెట్ లోటును భర్తీ చేయడంతో పాటు అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రైల్వే జోన్ వెంటనే కేటాయించాలని, దుగరాజపట్నంలో పోర్టు ఏర్పాటు చేయాలని, జాతీయ విద్య, పరిశోధన సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ వేదికగా పోరాడుతున్న మా పార్టీ ఎంపీలకు ప్రతి టీడీపీ కార్యకర్త మద్దతు ఉంటుందన్నారు.