Zs News /ద‌ళితుల‌కు అండాగా టిడిపి ప్ర‌భుత్వం-సోమిరెడ్డి

99

జిల్లాస‌మాచారం(వెంక‌టాచ‌లం) వెంకటాచలం మండలం తిక్కవరప్పాడు పంచాయతీలోని మల్లుగుంట సంఘం గిరిజన కాలనీలో ఎన్టీఆర్ గృహాల నిర్మాణానికి సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త శ్రీ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మొదటి నుంచి దళిత, గిరిజన ప్రజలు సోమిరెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తున్నారని,వీరి బాగోగుల కోసం మంత్రి సోమిరెడ్డి నిత్యం తపిస్తుంటారన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు పేదల కోసం వినూత్న పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
పార్టీ నాయకులను నిరంతరం ప్రజలే మధ్యే ఉంచుతూ పేదల అభ్యున్నతికి విశేషంగా పాటుపడుతున్న నేత మన చంద్రబాబు నాయుడ‌ని పేర్కొన్నారు. యువ నాయకులు, పంచాయతీ రాజ్ మంత్రివర్యులు లోకేష్ బాబు కృషితో మరో మూడు నెలల్లో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందుబాటులోకి రానున్నాయ‌ని వివ‌రించారు. 75 యూనిట్లు లోపు విద్యుత్ ను వినియోగించుకునే దళితులు, గిరిజనులకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చంద్రన్న బీమా పథకం పేదల జీవితానికి ఓ భరోసా అన్నారు. గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు దయతో వెంకటాచలం మండలానికి రూర్బన్ పథకంలో చోటు లభించిందన్నారు.రూర్బన్ పరిధిలోని ప్రతి పల్లెలో వీధులన్నీ సిమెంట్ రోడ్లుగా మారుతున్నాయని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నేత‌లు పాల్గొన్నారు..