Zs News /నిప్పో భూములను కాపాడండి

57

జిల్లా సమాచారం (నెల్లూరు)నగరంలోని ప్ర‌ధాన ర‌హ‌దారిలో ఉన్న కోట్లాది రూపాయల విలువచేసే నిప్పో భూములను పెద్దలకు ఇవ్వవద్దని నెెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ బంగ్లాకి వెళ్ళి ఇంతియాజ్ అహ్మద్ కు నిప్పో భూముల విషయంపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయలు విలువ చేసే నిప్పో భూములు రకరకాల ప్రచారాలు వస్తున్నాయని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి, నిప్పో యాజ‌మాన్యంతో మాట్లాడి ఈ స్థలంలో యువతకు ఉపాధి కల్పించే విధంగా గాక‌ పెద్ద పరిశ్రమను నెలకొల్పాలని సూచించారు. అలా కాకుండా కార్పొరేట్ సంస్థలకు నిప్పో భూములను కట్టబెట్టాలని చూస్తే వైకాపా తరపున పోరాటం చేస్తానని చెప్పారు. మంత్రి నారాయణ చెప్పిన విధంగా నిప్పో భూములలో అందమైన పార్కు, పేదలకు ఇళ్ళు నిర్మిస్తామంటే మాకు ఎటువంటి అభ్యతరం లేదన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు నిప్పో భూములలో షాదీ మంజిల్, హింధూ సోదరులకు కళ్యాణ మండపం, క్రైస్తవ సోదరులకు మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణమునకు స్థలాలు కేటాయించాలని కోరారు. ముస్లిం సోదరుల కోసం షాదీ మంజిల్ నిర్మించేందుకు నా స్నేహితులు, సోదరుడు, లోక్ సభ, రాజ్యసభ సభ్యుల సహకారంతో రూ. 30లక్షల నిధులు ఇస్తామన్నారు. అదే విధంగా బీసీలకు అని్న రకాల చేతి వృత్తుల శిక్షా తరగతులకోసం భూములు కేటాయించాలని కోరారు. నిప్పో భూములకు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వరు్ల, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్, జిల్లా అధఇకార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.