నాయుడుపేట‌లో ఘ‌నంగా రాజ్యాంగ దినోత్స‌వం

149

( జిల్లా స‌మాచారం -నాయుడుపేట )- నాయుడుపేట ప‌ట్ట‌ణంలో రాజ్యాంగ దినోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. మున్సిప‌ల్ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఛైర్ప‌ర్స‌న్ మైలారి శోభారాణి ముఖ్య అతిథిగా విచ్చేసి, రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బి.ఆర్ అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం ఓ ప‌విత్ర గ్రంధం లాంటిద‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ రాజ్యాంగం ప్రాముఖ్య‌త‌ను తెలుసుకోవాల‌ని అన్నారు. భార‌త‌దేశానికి అతిపెద్ద రాజ్యాంగం అందించిన మ‌హ‌నీయులు డాక్ట‌ర్ బి.ఆర్ అంబేద్క‌ర్ అని కొనియాడారు. అటువంటి మేధావుల‌ను నేటి యువ‌త‌రం స్ఫూర్తిగా తీసుకోవాల‌ని అన్నారు. నేడు పీడిత వ‌ర్గాల‌కు స‌మాన హ‌క్కులు అందుతున్నాయంటే అది రాజ్యాంగం వ‌ల్లేన‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఉమామ‌హేశ్వ‌ర్ రావు, కౌన్సిల‌ర్లు, సిబ్బంది పాల్గొన్నారు.