నాయుడుపేట ఛైర్మన్ శోభారాణి ఆధ్వర్యంలో పచ్చదనానికి శ్రీకారం

155

జిల్లాసమాచారం(అశోక్ కుమార్ రాజు,రిపోర్టర్, నాయుడుపేట), నాయుడుపేట పట్టణం లో బస్టాండ్ ఎదురుగా ఉన్న పాత హైవే రోడ్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ దగ్గర నుండి ఎమ్మార్వో అఫీసు వరకు గల రోడ్డు డివైడర్ పై చెట్లు నాటి పచ్చదనంతో పాటు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని నాయుడుపేట మునిసిపల్ చైర్మన్ మైలారి శోభారాణి ప్రారంభించారు. చెట్ల పెంపకానికి అవసరమైన నీటి సరఫరా చేసేందుకు అధునాతన పద్దతులలో డ్రిప్ సిస్టం వినియోగిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపి నియోజకవర్గ ఇంచార్జి పరసా వెంకటరత్నం, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపి జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు రఘునాథ రెడ్డి, మాజీ ఎఎంసి ఛైర్మెన్ విజయభాస్కర్ రెడ్డి, నాయుడుపేట పట్టణ టీడీపి అధ్యక్షుడు కంధల క్రిష్ణారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.